అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 29 (ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: అందోల్ మండలం అల్మాయిపేట గ్రామ శివారులో, సర్వే నంబర్513, ఎఫ్ టి ఎల్, పరిధిలో ఉన్న, స్థలంలో గీత పౌల్ట్రీపరిశ్రమనునిర్మించడం జరిగిందని, ఈ విషయంపై స్థానిక తహసిల్దార్, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చిన, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కావున అట్టి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని, దళిత సంఘాల నాయకులు, మొగులయ్య తెలిపారు, శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు,ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు అధికారులు వెంటనే స్పందించి ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న గీత పౌల్ట్రీ ఫామ్ పై షెడ్యూల్ తీసుకోవాలని కోరారు..