👉 మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 29 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం సాయంత్రం,ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు,ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రంజాన్ ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు, జోగిపేట స్థానిక శ్రీరామ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు, సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు, ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు, రంజాన్ మాస విశిష్టతను కొని యాడారు, అన్ని మతాలు చెప్పేది ఒక్కటే అని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఆర్ డి ఓ పాండు, తహసిల్దార్ విష్ణు సాగర్, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు మీర్ గోరి ఆలీ ముస్లిం మైనార్టీ సోదరులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు….