కార్య‌క‌ర్త‌లకు బిఆర్ఎస్ పార్టీ అండ‌గా ఉంటుంది

 

👉సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి 29(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎల్లారం ముత్తయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరపున రెండు లక్షల చెక్కును సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ చేతుల మీదుగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు,దేశంలో ఎక్కడ లేని విధంగా పార్టీ స‌భ్య‌త్వం క‌లిగిన బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే రెండు లక్షల సహాయం అందిస్తూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండటానికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు,కేసీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గార్లకు బాధిత కుటుంబా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మ్యాకం విటల్, పిఎసిఎస్ చైర్మన్ రాజు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, అనంతసాగర్ మాజీ సర్పంచ్ ఇంద్రారెడ్డి , మాజీ ఉపసర్పంచ్ రఘునాథ్ రెడ్డి, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి జలీల్, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, ఎర్రోళ్ల చిన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking