సిరిపురం వసతి గృహ సంక్షేమ అధికారి తుల్జారామ్ గౌడ్
వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి(ప్రజాబలం మార్చి 29) వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంప్రతి ఒక్కరికి సమాజంలో చదువుతోనే గుర్తింపు వస్తుందని ప్రతి ఒక్కరు చదువుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చిన్న పిల్లలను పనిలో పెట్టకూడదని వారికి బడికి పంపించాలని సిరిపురం వసతి గృహ సంక్షేమ అధికారి జి తుల్జారాం గౌడ్ అన్నారు ,పౌరాహా కుల అవగాహన పురస్కరించుకొని శనివారం మర్పల్లి మండల కేంద్రంలోని మొగిలిగుండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు ఆర్ఐ మాధవరెడ్డి మాట్లాడుతూ పౌరులు తమ హక్కుల తో పాటు బాధ్యతలను గుర్తించాలని గ్రామంలో కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని చిన్నతనంలో బాలికులకు వివాహాలు చేయరాదని ఆయన అన్నారు ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి అనిత నాగరాజు ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వనాథం గ్రామ ప్రజలు పాల్గొన్నారు