డిసిసిబి డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి మే 2 (ప్రజాబలం) ఖమ్మం
కాంగ్రెస్ పార్టీ తో మాత్రమే కురుమ యాదవుల, బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యపడుతుందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కురుమ యాదవుల సమావేశాలను ఉద్దేశించి డిసిసిబి డైరెక్టర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు గురువారం రఘునాథపాలెం, కూసుమంచి మండలాల యాదవ ప్రముఖుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ఇప్పటివరకు బడుగు బలహీన వర్గాలు, దళితులు మైనారిటీలు ముఖ్యంగా కురుమ యాదవుల సంక్షేమం అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాలంలో జరిగిందని, ఆ తర్వాత మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాలు నమ్మకద్రోహం చేశాయని, ప్రజా సంక్షేమ పరిపాలనను తుంగలో తొక్కి కుటుంబ పాలనతో ఇష్టారీతిన వ్యవహరించి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుల రాష్ట్రంగా మార్చారని ఘాటుగా విమర్శించారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి రంగం అభివృద్ధి చెందిందని, కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో జీవితకాలం ప్రజలు మరిచిపోలేని పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, దానిలో భాగంగా కురుమ యాదవులని గుర్తించి, ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్సీడీసీ ద్వారా మన ఖమ్మం జిల్లాకు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గొర్రెలకు మరియు గొర్రెల కాపరులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైందని, రికార్డ్ స్థాయిలో మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోన బోయిన పాపయ్య మందా నాగేశ్వరరావు, దొంత పైన ఉపేందర్ అంగడాల నరసింహారావు,బట్టు కోటేశ్వరరావు బాతుల సుధాకర్, మంద సురేష్ పురం గోపయ్య, కుర్రి మల్లయ్య కాట్రాల బిక్షం, కుర్రి ఐలేశ్వర్రావ్ అల్లిక రామకృష్ణ,పురం నాగేశ్వరరావు ఎర్రగడ్డ లింగయ్య, పురం రవి లోకేష్ ఇమ్మడి నానయ్య,పురం వెంకటేశ్వర్లు మారుతి రామారావు, మంద గోపి, పురం చంద్రయ్య, భారీ వీరభద్రం ఎర్రబోయిన వీరభద్రం,బాలిని శ్రీశైలం గడ్డం గంగయ్య పల్లెబోయిన శ్రీనివాస్, భారీ సురేషు చేబోలు మహేష్, దాసరి రమేష్ కాకర్ల రాంబాబు, ఎర్రబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు
