ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ కాకుంటే న్యాయవాద వృత్తి చేయరాదని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా కోర్టు కు విచ్చేసిన ఆయన మాట్లాడుతు లా డిగ్రీ ఎగ్జామినేషన్ రిజల్ట్ పాసై తరువాత న్యాయ వాది గా ప్రాక్టీస్ చెయ్యాలనుకుంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత బార్ అసోసియేషన్ లో మెంబర్ షిప్ తీసుకొని వృత్తి లో కొనసాగాలి , ఇట్టి విషయం తెలంగాణ లో ఉన్న ప్రతి బార్ అసోసియేషన్ కచ్చితంగా మెంబర్ షిప్ తీసుకునే సమయం లో కచ్చితంగా వెరిఫై చెయ్యాలనీ తెలంగాణ బార్ కౌన్సిల్ అదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎ ఐ బి ఇ పాస్ కాకున్నా వకాలత్ లో సంతకం, అటెస్టెడ్ చెయ్యడం లాంటివి చేస్తే వారిపై బార్ అసోసియేషన్ దృష్టి కి లేదా తమ దృష్టి కి తీసుకొస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొంటామని తెలిపారు. అదేవిధంగా 34 సంవత్సరాల లోపు కొత్త గా వృత్తి లోకి వస్తున్న వారు వెల్ఫేర్ ఫండ్ లో మెంబర్ గా చేరాలని పేర్కొన్నారు.