“కాంగ్రెస్ పార్టి ఎం.పి.టీ.సి. , బి.ఆర్.ఎస్.విద్యా కమిటి చైర్మన్ బి.ఎస్.పి.లో చేరిక”

“స్థానిక ప్రజాప్రతినిధులారా బహుజన సమాజ్ పార్టీలో చేరండి మీకు తగిన గుర్తింపు, గౌరవం మేమిస్తాం” అనీ పిలుపు నిచిన్న ముప్పారం.”

…..బీఎస్పీ అందోల్ అసెంబ్లీ ఇన్చార్జి ముప్పారం ప్రకాశం

సంగారెడ్డి సెప్టెంబర్ 9 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లా పరిధిలోని అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) నూతన కమిటీని ఆ పార్టీ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్ అధ్యక్షతన నేడు జరిగిన మండల సమావేశంలో, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి డా.ముప్పారం ప్రకాశం సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్థానిక ప్రజా ప్రతినిధులైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పిటిసిల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనదన్నారు. స్థానిక ప్రజాపాలన వ్యవస్థకు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలోచిత పరిపాలన వల్ల కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధి అభివృద్ధిలో భాగస్వాములైన రోజు ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడుతుంది అన్నారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల యోగ్యుడైన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల్లో పెట్టాలని, అందుకోసం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)తో కలిసి ఎన్నికల పోరాటం చేద్దాం రండి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాందాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ డాప్పు దుర్గయ్య, ఇదే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యా కమిటీ చైర్మన్ గంగారాం గార్లు, డా.ముప్పారం ప్రకాశం సమక్షంలో నేడు బీఎస్పీ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
పార్టీలో చేరికల కార్యక్రమం పూర్తైన అనంతరం “బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పి)” అల్లాదుర్గం మండల నూతన కమిటీ అధ్యక్షులుగా కొఠారి రాములు, ఉపాధ్యక్షులు బైగారి గంగారం, ప్రధాన కార్యదర్శిగా వీరబోయిన సాయిలు ముదిరాజ్, కార్యదర్శి తలారి అమృతయ్య, కోశాధికారిగా జలగల్ల అశోక్, కార్యవర్గ సభ్యులుగా కేతావత్ నరేష్ నాయక్, దోసపల్లి మానయ్య, ముత్తముల్ల కృష్ణ, మ్యాతరి శీను, మ్యాతరి సాయిలు, నర్సింలు యాదవ్, కార్యాల నర్సింలు, లతోపాటు 20 మంది సభ్యులను
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు సాయిబాబా, హరీష్, వినోద్, వెంకట్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking