తూప్రాన్, సెప్టెంబర్, 9. ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు లోని తాతపాపనిపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయుర్వేద వైద్య శిభిరం ఏర్పాటు చేసినట్లు తూప్రాన్ ఆయుర్వేద ఆసుపత్రి డాక్టర్ రుక్సాన తెలిపారు. శనివారం ఉదయం తూప్రాన్ మున్సి పరిధిలోని తాతపాపనిపల్లి లో ఆయుర్వేద వైద్య శిభిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రుక్సాన మాట్లాడుతూ ప్రతి శనివారం ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొన్నటి వారం లో తూప్రాన్ మున్సిపల్ పరిధి 1వ వార్డు లోని అర్టిసి బస్టాండ్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మామిడి వెంకటేష్, నాయకులు వెంకటేష్ యాదవ్, క్రుష్ణ, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.