ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్దత కల్పించి బీజేపి తమ చిత్తశుద్దిని చాటుకోవాలి.

…..బొర్ర భిక్షపతి మాదిగ
ఎమ్మార్పీఎస్, జాతీయ అధికార ప్రతినిధి

సంగారెడ్డి సెప్టెంబర్ 9 ప్రజ బలం ప్రతినిధి:
*వర్గీకరణపై కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, రాహుల్ గాంధీ గార్లు ప్రధానమంత్రికి లేఖ రాయాలి.. పార్లమెంట్ లో లేవనెత్తి మాదిగల పక్షాన నిలబడాలి. ఈ కీలక సమయంలో కెసిఆర్ నాయకత్వంలో అఖిలక్షానికి ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి అని డిమాండ్ చేస్తూ.
రిలే నిరాహార దీక్షలు:
★ వివాదాస్పద బిల్లులను ఎన్నో పార్లమెంట్ లో ఆమోదింపజేసుకుంటు అందరూ అనుకూలంగా ఉన్న వర్గీకరణ బిల్లుపై నిర్లక్ష్యం ప్రదర్శించడమంటే సామాజిక న్యాయాన్ని సమాధి చేయడమే.
★ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి.. 29 ఏళ్ల మాదిగల సుదీర్ఘమైన పోరాటానికి న్యాయమైన ముగింపు నివ్వాలి..
ఈనెల 9 నుండి 22 వరకు రిలే నిరాహార దీక్షలు
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి
బొర్ర భిక్షపతి మాదిగ ఎమ్మార్పీఎస్, జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన బిజెపి, ఎన్నో వివాదాస్పద బిల్లులను పార్లమెంట్ ద్వారా ఆమోదింపజేసుకుంటూ అందరూ అనుకూలంగా ఉన్న పైసా కూడా భారం పడని న్యాయమైన వర్గీకరణ సమస్య పరిష్కారం చేయకపోవడం భావ్యం కాదని ఇచ్చిన మాటకు కట్టుబడి 18 నుండి మొదలయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఎస్సీ రిజర్వేషన్లు ఉమ్మడిగా సాగడం వలన దశాబ్దాల తరబడి ఏకపక్షంగా దోపిడీకి గురవుతున్నాయని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా వారికి న్యాయబద్ధంగా అందాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని, 30 ఏళ్లుగా అనేక వేదికల మీద మాట్లాడి, మద్దతుపలికి, లేఖలు రాసి,తీర్మానాలు చేసి, కమిషన్లు వేసి, వర్గీకరణ పోరాటానికి కట్టుబడి ఉన్నామనే బిజెపి కాలయాపన చేయకుండ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
తమ పార్టీ పండిట్ దీన్ దయాల్ అంత్యోదయ స్ఫూర్తికి అనుగుణంగా నడిచే పార్టీ అని చెప్పుకునే మీరూ పండిట్ దిన్ దాయల్ స్ఫూర్తికి అనుగుణమైన వర్గీకరణపై నాంచివేత ధోరణి ఎందుకని? ప్రశ్నించారు. వర్గీకరణను విస్మరించడం అంటే తమ పార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి, సామాజిక న్యాయానికి సమాధి చేయడమేనని గుర్తుచేశారు.
ఎవరు ప్రస్తావించని అనేక సమస్యలను, అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు, త్రిబుల్ తాలక్, GST, నోట్ల రద్దు, పౌరసత్వం, బాబ్రీ, జమ్మూకాశ్మీర్ 371 తదితర వివాదాస్పద బిల్లులను పార్లమెంట్ లో ఆమోదింపజేసుకుంటు ఒక్కపైసా కూడా భారం పడని న్యాయమైన సమస్యపై మాత్రం తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ మాదిగ, మాదిగ ఉపకులాల చిరకాల ఆకాంక్షను సాకారం చేసేలా కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, ఖర్గే గార్లు ప్రధానమంత్రికి లేఖ రాసి అలాగే పార్లమెంట్ లో లేవనెత్తి మాదిగల పక్షాన నిలబడాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో అఖిలక్షానికి ఢిల్లీకి తీసుకెల్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ అధిష్టానం స్పందించి ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు వచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని, 29 ఏళ్ల మాదిగల సుదీర్ఘమైన పోరాటానికి న్యాయమైన ముగింపు నివ్వాలని కోరారు. ఈ దీక్షలు 22 తేదీ వరకు కొనసాగుతాయని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు నిరసనలు ఆందోళనలతో ఉద్యమాలను కొనసాగిస్తామని, ఈపోరాటాలు ఉదృతం కాకంటే ముందే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో..*మైసగళ్ల బుచ్చెంద్ర మాదిగ*
ఎమ్మార్పీఎస్, జిల్లా కన్వీనర్ అబ్రహం మాదిగ
ఎం ఎస్ పి, జిల్లా కన్వీనర్ , మాతంగి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్, జిల్లా కో కన్వీనర్, సాడకుల కృష్ణ మాదిగ, ఎం ఎస్ పి జాతీయ నాయకులు
పెద్ద గీత మాదిగ ఎంఎంఎస్, రాష్ట్ర నాయకురాలు, దేవరంపల్లి అశోక్ మాదిగ ఎం జె ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త, మిదిదొడ్డి రాజీవ్ మాదిగ
ఎమ్మార్పీఎస్, జిల్లా నాయకులు,*మ్యాతరి మల్లేశ్ మాదిగ ఎమ్మార్పీఎస్, జిల్లా నాయకులు,
మల్లెల నరసింహ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, *అలిగె రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులుపోతురాజు శివ మాదిగ* సంగారెడ్డి టౌన్ నాయకులు, *గంగేరి అనిల్ మాదిగ సంగారెడ్డి టౌన్ నాయకులు, *ముక్కగళ్ల భిక్షపతి మాదిగ ఎం ఎస్ పి నాయకులు, *రజినీకాంత్ మాదిగ నాయకులు,
కె పల్లవి మాదిగ ఎంఎంఎస్, నాయకురాలు,
గాలమ్మ మాదిగఎంఎంఎస్ సీనియర్ నాయకురాలు
*అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రేమ్ చంద్ మాదిగ ఎమ్మెస్ ఎఫ్ నాయకులు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking