అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారని నాకు నమ్మకం కలుగుతుంది :
అబ్జర్వర్ వినోద్ కూమార్
అంబర్‌పేట్ ప్రజాబలంప్రతినిధి:అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజక వర్గంలోని మాజీ రాజ్యసభసభ్యులు వి.హనుమంతరావ్ డీసీసీ ఖైరాతాబాద్ జిల్లా అధ్యక్షులు అంబర్‌పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్ధి డా॥రోహిణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం ఈ కార్యక్రమానికి అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజక వర్గం అబ్జర్వర్లుగా నియమితులైన వినోద్ కూమార్ ,సౌజన్య నేతృత్వంలో అంబరాన్నంటిన అంబర్‌పేట కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం .ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభసభ్యులు వి.హనుమంతరావ్ ,డా॥రోహిణ్‌రెడ్డి ,అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజక వర్గం అబ్జర్వర్లు వినోద్ కూమార్ ,సౌజన్య లను శాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగినది.ఈ సందర్భంగా వి.హనుమంతరావ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతికార్యకర్తకు న్యాయం జరిగేలా నేను కృషి చేస్తానని అన్నారు.

డా॥రోహిణ్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నన్ను ఆదరించిన ప్రతికార్యకర్త కొరకు నాకు తెలుసు.ఆ కార్యకర్తలకు న్యాయం చేకూరేలా నావంతు ప్రయత్నం నేనుచేస్తాను .ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది.ప్రతికార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి. మీ బాద్యత నాది అని అన్నారు.అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజక వర్గం అబ్జర్వర్ వినోద్ కూమార్ మాట్లాడుతూ ఏఐసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఆదేశాలతో ఈ నియోజక వర్గానికి అబ్జర్వర్‌గా నేను వచ్చినాను.అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బ్లాక్ కమీటీలకు డివిజన్ కమీటీలకు పదవులు ఆశించిన వాళ్ళు మీ బయోడేటాని నాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.అనంతరం నియోజకవర్గంలొ మేము డివిజన్ల వారిగా పర్యటిస్తాం.మీరు ఆశించిన పదవులకు మేము తెలుసుకుని అదిష్ఠానానికి నివేదిక పంపిస్తాం.ఈ నియోకవర్గ కార్యకర్తల సమావేశాన్ని చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అంబర్‌పేట నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారని నాకు నమ్మకం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్‌యాదవ్ ,పీ.నారాయణ స్వామి , ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్‌గౌడ్,మోతే రోహిత్,లక్‌పతి యాదగిరిగౌడ్, మాజీ కార్పోరేటర్లు గరిగంటి రమేష్,దిడ్డి రాంబాబు, పులి జగన్ ,టీపీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు సీనీయర్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాల్లు తదితరులు పాల్గోన్నారు.
