గాంధీ భవన్‌ లో జరిగిన విషయాలు చాలా బాధాకరం

పెద్ద మనసు చేసి అందరూ తనను, మహిళ కాంగ్రెస్‌ నాయకులను క్షమించాలి
గాంధీ భవన్‌ ప్రెస్‌ మీట్‌లో సునీత రావ్‌, మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు..
నాంపల్లి గాంధీభవన్‌ ప్రజాబలం ప్రతినిధి:మంగళ వారంనాడు తెలంగాణ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మొగలి సునీత రావు తనకు వచ్చిన క్రమశిక్షణ నోటీస్‌ పై గాంధీభవన్లో ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడడం జరిగింది.
ఏదైతే నోటీస్‌ వచ్చిందో దానికి జవాబు రిప్లై ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు ఫోన్‌ ద్వారా మాట్లాడటం జరిగింది. అందులో రాష్ట్ర ఇంచార్జ గౌరవనీయులు మీనాక్షి నటరాజన్‌ , టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ని అలాగే ఇటీవల ఢల్లీికి వెళ్లినప్పుడు జాతీయ అధ్యక్షురాలు అయిన ఆల్కలాంబ ని స్వయంగా కలిసి మాట్లాడటం జరిగింది.
గాంధీ భవన్‌ లో జరిగిన విషయాలు చాలా బాధాకరం,ఉద్దేశ్య పూర్వకంగా చేసింది కాదు కాబట్టి తను చేసినా, తన మహిళా కాంగ్రెస్‌ నాయకులు ఎవ్వరు చేసిన బాధ్యత తనదే అని పెద్ద మనసు చేసి అందరూ తనను, మహిళ కాంగ్రెస్‌ నాయకులను క్షమించవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని, పీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ని కాంగ్రెస్‌ అధిష్టానం ను కోరడం జరిగింది.
అలాగే మన టి.పి.సి.సి అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ రాబోయే కాలంలో మహిళా కాంగ్రెస్‌ కి పెద్ద పీఠ వేస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఎస్సీ.ఎస్టీ.బీసీ. మైనారిటీలకు అందరికీ కూడా సమ న్యాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది.
నేను పార్టీ మారుతున్నాను అని వచ్చే వార్త పూర్తిగా అవాస్తవం అని ఇట్టి వదంతులన్నీ నమ్మవద్దని అలాగే నేను ఏ పార్టీ మారను అధిష్టానం నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటానని మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది.
మహిళ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులకు శిక్షణ.
జాన్‌ 3వ తేది నుంచి ఢల్లీి లోని పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌ లో మహిళ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రాష్ట్రం నుంచి 5 గురి జిల్లా అధ్యక్షులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking