నియోజక వర్గ ప్రజలకు లక్ష్మీ కటాక్షం కలగాలి: తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 04:
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. మదర్స్ ట్రేడర్స్ అధినేత , కాసం వస్త్ర, వాణిజ్య సముదాయాల వ్యాపారవేత్త నమశ్శివాయ కుటుంబ సమేతంగా సి ఎస్ ఆర్ గార్డెన్ పక్కన కాసం వారి స్వస్థలంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శత చండి యాగంలో బాగంగా రెండవ రోజు నిర్వహించిన లక్ష్మీ అమ్మవారి పూజకు సతీ సమేతంగా విచ్చేసిన ఆయనకు యాగ నిర్వాహకులు, 28వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ గంద కల్పన నవీన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాసం వారి ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో మూడు రోజులపాటు శత చండీయాగం ప్రజాక్షేమం, లోక కళ్యాణార్థం చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అమ్మవారి కటాక్షంతో జిల్లా ప్రజల తోపాటు యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసం కేదారినత్, పోల నటరాజు, లయన్ ఆడెపు రవీందర్ కాసం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking