బహుజన విప్లవానికి నాంది పలుకుదాం

ఢిల్లీ ధర్నా లో బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీమాన్ తాడూరి

పెద్ద పెళ్లి ప్రజాబలం మార్చి 4÷

దేశంలో రానున్నది బహుజన సామాజిక విప్లమేనని బీసీలు సంఘటితశక్తిగా అవతరించనున్నారని పెద్దపెల్లి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరు శ్రీమన్నారాయణ పేర్కొన్నారు ఏప్రిల్ 3 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న బీసీ సమస్యలపై సమరశీల పోరాటాలలో భాగంగా నాలుగో తేదీ మంగళవారం ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య చేపడుతున్న బీసీ ఉద్యమాల ఫలితంగానే రాజకీయ పార్టీలు కలిసి వస్తున్నాయని అన్నారు మూడో తేదీ సోమవారం రోజున డీఎంకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి బీసీ జనగణ చేపట్టుటకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు ఆర్ కృష్ణయ్య మొదటి డిమాండ్ బీసీల కుల గణన కాంగ్రెస్ పార్టీ సహకారంతో నెరవేరానున్నదని తెలిపారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన పోరాట యోధులు ఆర్ కృష్ణయ్య ఉద్యమాల ఫలితంగానే చాలామంది బీసీలు ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా ఎదిగారని తెలిపారు ప్రధాని మోదీ ప్రభుత్వం కృష్ణ అన్న కోరుతున్నట్లు కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు త్వరలో స కారం లభించు నున్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా నుండి ఆర్ కృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తూ బీసీల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు..

జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు దాసరి హనుమయ్య మాట్లాడుతూ బీసీల ఏకీకరణ దిశలో బీసీ ఉద్యమాలను బలోపేతం చేయాలని కోరారు చట్ట సభ లా లో బీసీల రిజర్వేషన్లపై పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం ముందు గత 60 రోజులుగా బి.ఎస్.పి పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు బీసీల ఏకీకరణ దిశలో కృషిలో భాగంగా ఆర్ కృష్ణయ్య నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు పెద్దపల్లి గౌరవాధ్యక్షులు దాసరి హనుమయ్య తో పాటు వివేక్ పటేల్ నాగరాజు సతీష్ వింజమూరి సురేష్ బొద్దుల అరుణ స్వరూప నిర్మల లక్ష్మి మనోహర తదితరులు పాల్గొన్నారు

అధ్యక్ష గౌరవాధ్యక్షులకు సన్మానం

ఢిల్లీ ధర్నా వేదికగా బీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తున్న బీసీ హక్కుల కోసం పోరాడుతున్న బహుజన నాయకులైన పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ తో పాటు గౌరవ అధ్యక్షులు దాసరి హనుమయ్యను ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రతిష్టను కాపాడుతూ సంఘం యొక్క ఆశయాలను పెద్దపెల్లి జిల్లాలో మారుమూల ప్రాంతాలకు తీసుకు వెళుతూ బీసీల ఉద్యమాలులను సంఘటిత పరుస్తున్నందుకు శ్రీమన్నారాయణకు హనుమయ్యలకు సన్మానం చేసినట్లు ఆరు కృష్ణయ్య వివరించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking