ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 04 : మంచిర్యాల శివారు నస్పూర్ మున్సిపాలిటీ లో ఈ నెల 8 వ తేదీన ఏర్పాటు చేసిన జై భారత్ సత్యాగ్రహ ప్రాంగణంకు మహాత్మాగాంధీ నామకరణం చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు…8వ తేదీన జరిగే సభకు లక్ష యాభై వేల మంది జనం వస్తారని అన్నారు.ఇంద్రవెళ్లి సభను తలపించేలా నస్పూర్ సభ ఉంటుందని తెలిపారు.సభకు జాతీయ,రాష్ట్ర కాంగ్రెస్ అతిరథమహారధులు వస్తున్నట్లు చెప్పారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్,జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్,జైరాం రమేష్,కొప్పుల రాజు,పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,మాజీ పీసీసి అధ్యక్షులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ,మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,పార్టీ నేతలు హాజరవుతారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో పాటు పార్టీ నేతలు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.