నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 01 : మంచిర్యాల నియోజకవర్గంను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దుతానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలం లో కొత్తూరు, తిమ్మాపూర్, కొమ్ముగూడెం, దౌడేపల్లి,చెల్లంపేట గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి 8 కోట్ల రూపాయల నిధులతో తో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నియోజకవర్గం లోని ప్రతీ గ్రామానికి అనుసంధానం చేస్తూ సౌకర్యవంతమైన రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. తద్వారా గ్రామాలలో రవాణా సౌకర్యాలు మెరుగు పడి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు.
రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానన్నారు.నిర్మాణం లో ఉన్న లక్షెట్టిపేట ప్రభుత్వ పాఠశాలకు మరో 2 కోట్ల రూపాయల నిధులతో ఇంకొక రెండు అంతస్థులు నిర్మించడానికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.అయన వెంట అధికారులు,స్థానిక నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking