ఇన్వెస్టగేషన్ పూర్తి ఆధారాలతో పారదర్శకతతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలి
త్రీ లేయర్ పద్ధతి ద్వారా ఎన్ బీ డబ్ల్యూ ఎస్ ఎగ్జిక్యూట్ చేయాలి
పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి , మంచిర్యాల జోన్ పరిధిలోని డిసిపి,ఎసిపి , సీఐ,పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అధికారులతో ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా యు ఐ కేసులు,గ్రేవ్ యుఐ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం,ఎస్ సి/ఎస్,టీ/యూఐ కేసులు, ఉమెన్ ఎగైనెస్ట్ కేసులు,పిఓసిఎస్ఓ కేసుల పరిష్కారం,ఎన్ డీ పీ ఎస్ యాక్ట్ కేసుల,పెండింగ్ కేసులపై రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్ సమీక్షా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…అసహజ మరణాలు,మిస్సింగ్ కేసుల గురించి డిసిపి,ఎసిపి,సిఐ ల స్థాయిలో రివ్యూ చేసి త్వరితగతిన పరిష్కరించాలని,ఎవరైనా తప్పి పోయినట్లు ఫిర్యాదు అందినచో ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసి తప్పి పోయిన వ్యక్తి యొక్క వివరాలతో కూడిన ఫోటో అన్ని పోలీస్ స్టేషన్ల కు పంపించి సంబంధిత వెబ్ సైట్ లో పొందు పరచాలని ఆదేశించారు. అదే విధంగా అసహజ మరణాలు దర్యాప్తు చేయునపుడు మృతుని మరణానికి గల కారణాలను లోతుగా పరిశోధించి,సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తగు విధంగా పరిష్కరించాలని సూచించారు.అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో,ఎస్సీ,ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు.ప్రతి సిడి ఫైల్ ను,అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని,పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు తీసుకోవాలన్నారు.ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని తెలిపారు.