స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కోసమే బీసీ కమిషన్ ఏర్పాటు
….నిరంజన్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్.
సంగారెడ్డి కలెక్టరేట్లో బీసీ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కుల సంఘాల నాయకులతో బహిరంగ విచారణ.
స్థానిక సంస్థల లో బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ల కోసమే కమిషన్ ఏర్పాటు
…..జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి అక్టోబర్ 30 ప్రజ బలం ప్రతినిధి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా బీసీలకు సముచిత స్థానం కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.
బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ కుల సంఘాలతో నిర్వహిస్తున్న బహిరంగ విచారణ కార్యక్రమాలలో భాగంగా బీసీ కమిషన్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో బీసీ కుల సంఘాల నాయకులు రాజకీయ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులతో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు.
బీసీ కమిషన్ చైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు రాయపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగకపోవడం వల్ల స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు భారీగా పేరుకుపోయి స్థానిక సంస్థలలో అభివృద్ధి
నిలిచిపోయిందన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడం కోసం బీసీ కమిషన్ ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరణ కోసం నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కుల గణన కార్యక్రమం సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా సేకరించిన అభిప్రాయాలు మేరకు ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించి బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించేలా చర్యలు చెప్పడం ఉన్నట్టు తెలిపారు. బీసీ కమిషన్ బీసీల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయింది అన్నారు. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీసీలకు జనాభా ప్రాతిపదికన అందేలా చేయడం కోసం బీసీ కమిషన్ కృషిచేయునట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారం చేయడం కోసం కమిషన్ ఏర్పాటు చేయడం సంతోషించ దగ్గ విషయమని, బీసీలు సామాజిక ఎదుగుదల కోసం ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని, కమిషన్ కు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు తమ తమ అభిప్రాయాలను తెలిపి బీసీ సంక్షేమం కోసం తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, ఏం. నగేష్, మహ్మద్ హామీద్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, సంబంధిత జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.