యుద్ధ ప్రాతిపదికన భూగర్భ సంపుల నిర్మాణం పూర్తి చేయాలి : రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్
సెక్రటేరియట్ 23, నవంబర్ 2024:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భూగర్భ సంపులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ గ్రేటర్ మహా నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు.
శనివారం ఖైరతాబాద్ జోన్ పరిధి
రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ప్రవేశ మార్గంలో భూగర్భ సంపు (రెయిస్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్) నిర్మాణ పనుల పురోగతిని
ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ HMDA,జల మండలి, GHMC అధికారులతో క్షేత్రస్థాయిలో కలిసి పరిశీలించారు.
అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న భూగర్భ సంపు నిర్మాణ పనులను పరిశీలించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రయోగాత్మకంగా 12 చోట్ల భూగర్భ సంపుల నిర్మాణ పనులను చేపట్టామని , వీటిలో 4 పూర్తి అయ్యాయని జీహెచ్ఎంసీ
అధికారులు ముఖ్య కార్యదర్శికి
వివరించారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టడం తద్వారా రోడ్లపై నీరు నిల్వకుండా చూడడం, ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేసేందుకు నిర్మిస్తున్న
భూగర్భ సంపులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న భూగర్భ సంపులను
త్వరితగతిన పూర్తి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
ట్యాంక్‌బండ్ పరిసరాలను అందంగా ముస్తాబు చేయాలి
“ప్రజాపాలన – ప్రజా విజయోత్సవం” పేరుతో రాష్ట్ర ప్రభుత్వం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధాన మార్గాలను పరిశుభ్రంగా, సుందరంగా
తీర్చిదిద్దాలనీ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ అధికారులను ఆదేశించారు.
శనివారం HMDA,జల మండలి, GHMC అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, అసెంబ్లీ, సచివాలయం, సంజీవయ్య పార్క్ రోడ్డు మార్గాలను ముఖ్య కార్యదర్శి
పరిశీలించారు .
నగరంలో “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవం” వేడుకల విజయవంతం కు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ వేడుకలను తిలకించేందుకు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.
అవసరమైన చోట కొత్తగా తారు వేయడం, మరమ్మత్తులు చేపట్టడం,
మార్కింగ్, సంకేత సూచిల బోర్డుల ను ఏర్పాటు చేయాలన్నారు. రహదారి వెంబడి ఉండే ఇనుప గ్రిల్ లకు కలర్ వేయించేయాలన్నారు.
ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్‌రోడ్ డివైడర్ లు, కూడళ్లను అందంగా ముస్తాబు చేయాలన్నారు. నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ ప్రధాన మార్గాలకు ఇరువైపులా మిరుమిట్లు గొలిపేలా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏమైనా అభివృద్ధి పనులు ఈ ప్రాంతాల్లో పెండింగ్ ఉంటే వేగిరం చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
క్షేత్ర పరిశీలన లో ముఖ్య కార్యదర్శి వెంట
HMDA కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, వాటర్ వర్క్స్ ఏం డి అశోక్ రెడ్డి, జోనల్ కమీషనర్ అనురాగ్ జయంతి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఉన్నారు.