ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

మెదక్ మనోహరాబాద్ ప్రాజబలం న్యూస్ :- మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో మంగళవారం నాడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి డిప్యూటీ తహశీల్దారు కౌశిక అలాగే ఏపీవో ఆదినారాయణ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అదేశాల మేరకు పనుల జాతర లో భాగంగా గ్రామంలో పశువుల షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.అలాగే ఉపాధి హామీ పథకంలో భాగంగా వంద రోజులు పూర్తి అయిన ఉపాధిహామీ కార్డు దారులను మల్టీపర్పస్ వర్కర్ల ను నర్సరీ వన సేవకురాలిని సన్మానించడం జరిగింది.ఈకార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ పంచమి రేణు కుమార్ గ్రామ కార్యదర్శి నాగరాజు ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ సీనియర్ మేటు నాగమణి మరియు నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking