రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 నవంబర్ 2024
75 వ భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ది సిటిజన్స్ కౌన్సిల్ ఆద్వర్యంలో 26 మంగళవారము రోజున మణికొండ కౌన్సిల్ అంతర్గతంగా ఉన్న నెక్నంపూర్ గ్రామ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం విగ్రహలకు పుష్పాలంకరణ గావించి సముచిత గౌరవ ప్రధంగా వందన సమర్పణ గావించి, రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేయడం లక్ష్యంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు, గవర్నమెంట్ పాఠశాల అధ్యాపుకులకి కుంబగళ్ళ ధనరాజ్ చే రాజ్యాంగ పుస్తక వితరణ తదనంతరం నెక్నంపూర్ గవర్నమెంట్ పాఠశాల అధ్యాపకుడు ఎం.డీ. అనీస్, ఉపాధ్యాయులు మహేష్, రవికుమార్, అరుణలత, సుజాతల సమక్షంలో 200 మంది విద్యార్థులకు బొమ్ము ఉపేందర్నద్ రెడ్డి ద్వారా మంచి నీటి నాణ్యమైన స్టీల్ (సీసా) బాటల్, చాక్లెట్ వితరణ గావించిన కార్యక్రమం నిర్వహించడమూ, ఈ సందర్భముగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వారి సేవలను గుర్తించి వారి పేరున తల పెట్టిన భవనం వెంటనే ఫుప్పాలగూడలో పూర్తి చేయాలని మరియు వారి విగ్రహ ప్రతిష్టాపన కు మున్సిపల్ అధికారులు అవకాశాన్ని ఇవ్వాలని లేని యెడల మన రాజ్యాంగం చూపిన త్రోవలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్య పద్దతిలో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం విగ్రహ ప్రతిష్టాపనకు ముందుకు సాగుతామని డిమాండ్ చేస్తూ ఈ కార్య క్రమానికి హాజరైన ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ మహ్మద్, సంయుక్త కార్యదర్శి బొమ్ము ఉపేందర్‌నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు పద్మారావు, నవీన్ కుమార్, ఎం.ఆర్.పి.ఎస్ నరేందర్, ధనరాజ్, రూపా రెడ్డి, రామసుబ్బా రెడ్డి, బొడ్డు శ్రీధర్, ముతంగి లక్ష్మయ్య, గుట్టమీద నరేందర్, నాయుడు, యాలల కిరణ్, ప్రవీణ్, కృపాకర్, రఫిక్, రాజేంద్రప్రసాద్, సుమ, శ్రీకాంత్, హుస్సేన్, మొనేష్ తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించిన్నారు.
Prev Post
Next Post