అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే రాజ్యాంగం
రాజ్యాంగ రక్షణకు అందరు పాటుపడాలి
రాజ్యాంగం ద్వారానే సమసమాజం నిర్మాణం
ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 26 : అన్ని వర్గాల అభ్యున్నతికే రాజ్యాంగం పని చేస్తుందని,రాజ్యాంగం రక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని,రాజ్యాంగం ద్వారానే సమసమాజం నిర్మాణం సాధ్యమౌతుందని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా స్థానిక నాయకులతో కలిసి అయన మాట్లాడుతూ… నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందడంతో అందరికీ సమాన హక్కులు అందయాన్నారు. అంతకుముందు పట్టణంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరం నుండి డీజే తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దమ్మ నారాయణ,చిప్పకుర్తి నారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లం పెళ్లి రమేష్,మండల ఉపాధ్యక్షుడు బైరం లింగన్న,తోగరి కాంతన్న, దొంత నరసయ్య,పెండెం సత్తయ్య,పెరుగు తిరుపతి, బైరం రవి,మినుముల జనార్ధన్,పెండం రాజు, మినుముల వేణు, ఆకనపల్లి శిల్పత్తి,శ్రీనివాస్, సన్నీ,నరేష్,సత్తయ్య, రవీందర్,సుధాకర్, కుమార్,నవీన్,మండల నాయకులు,పట్టణ నాయకులు,అంబేద్కర్ అభిమానులు,అన్ని వర్గాల ప్రజలు,పాల్గొన్నారు.