నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్‌ రాజర్షి షా

మెదక్‌, ఫిబ్రవరి 10, 2023 మెదక్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైతు బజార్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి మార్చి నెలాఖరు నాటికీ ప్రజలకు అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా కాంట్రాక్టర్‌ ను ఆదేశించారు . శుక్రవారం స్థానిక కూరగాయల మార్కెట్‌ ఆవరణలో నిర్మిస్తున్న రైతు బజార్‌ నిర్మాణ పనులను , దుకాణ సముదాయాలు, పార్కింగ్‌ ప్రాంతాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమ సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, మునిసిపల్‌ కమీషనర్‌ జానకి రామ్‌ సాగర్‌ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ పనులు మరింత శరవేగంతో చేయాలని, అవసరమైతే కూలీలను రెట్టింపు సంఖ్యలో పెట్టుకోవాలని, ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. దుకాణాలను పారదర్శకంగా కేటాయించాలని సూచించారు.
కలెక్టర్‌ వెంట మార్కెట్‌ కమిటీ కార్యదర్శి , డిఎస్పి సైదులు, ఇంజనీరింగ్‌ అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking