ప్రత్యేక కార్యదర్శి కార్మికశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 04 : వేసవికాలం పూర్తియ్యే వరకు ప్రతి ఇంటికి నిరంతర త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి కార్మికశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల,కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు, బదావత్ సంతోష్,వెంకటేష్ ధోత్రే,అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు బి రాహుల్,దీపక్ త్రివారితో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ అధికారులు,మిషన్ భగీరథ ఏ.ఈ లతో వేసవి కాలం త్రాగునీటి ప్రణాళిక అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి కార్మిక శాఖ సంచాలకులు మాట్లాడుతూ… జిల్లాలో మిషన్ భగీరథ గ్రీడ్ ద్వారా ప్రతి ఇంటికి అందుతున్న సరఫరా ప్రక్రియను పరిశించాలని, ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలానికి కడెం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న 2,3 టి.ఎం.సీ నీటి నుండి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం పరిధిలో జిల్లాలోని జరుగుతున్న నీటి సరఫరా పై ప్రతిరోజు నివేదిక అందించాలని,బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలకు 1.8 టీ.ఎం.సీ నీరు అవసరం ఉండగా కొమరం భీమ్ జిల్లాలోని ఆడ ప్రాజెక్టు నుండి సరిపడా చేయడం జరుగుతుందని,ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.హెచ్చుతగ్గులు లేకుండా చూడాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకులు,పవర్ సోర్స్ పాయింట్ ద్వారా సరిపడా చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు. గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు సమన్వయంతో స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి మనలను గురించి పరీక్షించి తాగేందుకు ఉపయోగపడే నీటిని సరిపడా చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో గ్రామీణ స్థాయి ప్రణాళిక రూపొందించి గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి ఇంటితో పాటు మారుమూల గ్రామాలకు సైతం నిరంతరం త్రాగునీరు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీలో బోర్ వెల్ లో సైతం నిరంతరం తాగునీరు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.గ్రామ పంచాయతీలోని బోర్లు మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు ద్వారా ప్రతిరోజు నీటి సరఫరా చేయాలని బోర్ వెల్ పనితీరు పైపులను లీకేజీల పై నిరంతరం పరీక్షించాలని తెలిపారు. నల్ల కలెక్షన్ బోర్ వెల్ ద్వారా నీటి సరఫరా చేయలేని ప్రాంతాలను గుర్తించి మార్గాలు, వాటర్ ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. పైప్ లైన్ లీకేజీ సమస్యలు,బోర్ వెల్ మత్తులను యుద్ధ ప్రతి వదికన పరిష్కరించి నీటి సభలను పునః రుద్దరించేలా త్వరిత తిన పనులు చేపట్టను తెలిపారు.మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో 6 మున్సిపాలిటీలు,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ్డా ప్రాజెక్టు పరిధిలో 3 మున్సిపాలిటీలు,నీటి తరలింపుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రత అధికంగా నందున నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే 3 నెలలు ప్రతి ఇంటికి అందించేలా కర్యచరణ రూపొందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి వేసవి కార్యచరణ భాగంగా అవసరం ఉన్న ప్రాంతంలో బోర్ వెల్ లు అద్దె తీసుకుని నీటి సరపరాకు చర్యలు చేపడతామని తెలిపారు. మిషన్ భగీరథ గ్రిడ్ నుండి సరఫరా అయ్యే త్రాగునీటి పై ప్రతి రోజు పరీక్షించడం జరుగుతుందని, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు పూర్తి చెర్యలతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్ట్, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు. త్రాగేందుకు అదనపు ఉండే బోర్ వెల్ లను గుర్తించి నీటి అవసరాలను తీర్చేందుకు గాను నీటిని పరీక్షించి అనువుగా ఉండే వ్యవసాయ బోర్ బావులను గుర్తించి నీటి అవసరము తీర్చేందుకు గాను నీటిని పరీక్షించి అనువుగా ఉన్నట్లయితే ప్రత్యేకంగా సరుపర చేసినందుకు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో గల 640 మారుమూల గ్రామాలకు గాను 637 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించడం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.