సీజనల్ వ్యాధుల నియంత్రణ అప్రమత్తంగా ఉండాలి

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 16 : జిల్లాలోని సీజనల్ వ్యాధులు, కీటక నిత వ్యాధులు, డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా, అంటూ వ్యాధులు ప్రజల కుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణులు,ఎండి. పిజీషయన్లు,23,ఆసుపత్రితో సమీక్ష నిర్వహించి తీసుకోవాసిన చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ…ఆసుపత్రిలు,టి-డయాగ్నొస్టిక్ హబ్ లలో ఎలిసా పరీక్ష నిర్వహించిన తర్వాతనే డెంగ్యూగా నిద్దరనా చేయాలని తెలిపారు. ప్రవేట్ ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్బిష్ మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ఆసుపత్రిలో ఉండవలసిన పరికరాలు, సౌకర్యాలు కల్పించడంతో పాటు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.వైద్యుల వివరాలు,రుసుము వివరాలు, ఆస్పత్రి లో అందించే వైద్య సేవలు వివరాలు అందరికీ తెలిసే విధంగా ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ నిరోధక చట్టం ప్రకారం పుట్టబోయే ఆడబిడ్డ, మగ బిడ్డ వివరాలు తెలపడం జరగదని ప్రజలకు అర్థమయ్యే విధంగా గోడ పత్రాలు,టెక్సీలు ద్వారా ప్రదర్శించాలని, లింగ నిర్ధారణ చేయించుకున్న చేసిన, ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు వైద్య సేవలు కొరకు వైద్యులను సంప్రదించిన సమయంలో వారు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని,వ్యాధిగాస్తుల వివరాలు నమోదు చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందించినట్లయితే తీసుకోవాల్సిన ముందస్తు చరులపై అప్రమత్తంగా ఉండవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్కే వెంకటేశ్వర్లు. డి.డి‌.ఏ ప్రవళిక, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking