డ్రగ్స్ కు దగ్గరై భవిష్యత్తును పాడు చేసుకోవడ్డు – గురుకుల విద్యార్థులకు ఆర్డీవో సూచనలు సలహాలు.

 

తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మత్తు పదార్టాలకు బానిసలై విలువైన భవిష్యత్తును,కెరీర్ ను పాడు చేసుకోవద్దని తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా మంగళవారం తూప్రాన్ పట్టణ పరిధిలోని హైవే టోల్ ప్లాజా దగ్గరున్న బాలుర గురుకుల పాఠశాల, మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాలను ఆయన వేర్వేరుగా సమావేశ పరిచి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు వ్యసనాలతో యువత, వారి తల్లి తండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రగ్స్ కు యువత అలవాటు కాకుండా, నివారించే విషయాలపై తగిన సూచనలు, మెలుకవలను చెప్పారు. అలాగే పిల్లలకు కెరీర్ గైడెన్స్ పై కూడా అవగాహన కల్గించారు. గత ఆర్నెళ్ల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూలు ను ఆకస్మికంగా తనిఖీ చేసి మంత్రి సూచన మేరకు వివిధ కంపెనీల సహకారంతో పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆర్డీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking