జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యకాంతం కాకుండా చూడాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 16:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని ప్రతి మండలం లో ఉన్న ప్రభుత్వ భూములను అన్యకాంతం కాకుండా చూడాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.

మంగళవారం రోజున జె సి ఛాంబర్ లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో సర్వే ల్యాండ్ కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములను పర్యవేక్షించే బాధ్యత మీపై ఉందన్నారు. ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. సెంటు భూమిని కూడా అన్యకాంతం కాకుండా చూడాలని సర్వేలకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సర్వే లాంటి రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ,డిప్యూటీ ఇన్స్పెక్టర్, సర్వేయర్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking