జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
రాయలకు ఘనంగా సన్మానం
ఖమ్మం ప్రతినిధి జులై 16 (ప్రజాబలం) ఖమ్మం కష్ట పడితే పదవులు వాటంతట అవే వస్తాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో డిసిసి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్ట పడే వారిని అధిష్టానం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు.పాలేరునియోజకవర్గంలో రాయల నాగేశ్వర్ రావు పార్టీ ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారని, కార్యకర్తలకు అండగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై తనదైన రీతిలో అప్పటి పాలక పక్షంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పార్టీ కట్టుబాటులను గౌరవిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని తెలియజేశారు. రాయల భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ…కష్ట పడే మనస్తత్వం ఉన్న వ్యక్తి రాయల నాగేశ్వర్ రావు అని అలాంటి వ్యక్తిని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వంలో పదవి ఇవ్వడం శుభపరిణామం అని అన్నారు. మున్ముందు మరెన్నో పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను ఏకీభవిస్తూ, తనకు అప్పగించిన పదవిలో నిబద్ధతతో నడుచుకుంటూ అందరి మన్నలను పొందుతానని తెలిపారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజి MLC పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ అద్యక్షులు MD జావేద్,నాగండ్ల దీపక్ చౌదరి,పి సి సి సభ్యులు వడ్డే నారాయణ, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా,INTUC, కిసాన్, సేవాదళ్,SC,మైనారిటీ సెల్ అద్యక్షులు దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్ గౌడ్, SD గౌస్,బొడ్డు బొందయ్య,సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, రాష్ట్ర కిసాన్,OBC సెల్ ఉపాద్యక్షులు దాసరి దానియేలు, వడ్డేబోయిన నరసింహరావు,కార్పొరేటర్ లకావత్ సైదులు నాయక్, నగర OBC సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, మందపల్లి నాగమణి, ఉన్నం రాజశేఖర్ వివిధ మండలాల అద్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.