వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 3:
కాంగ్రేస్ పార్టీ నాయకుడు మహ్మద్ అయూబ్ అద్వర్యంలో పోచమ్మ మైదాన్ జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్యాస్ పెంపుదలపై రోడ్డుపై వంటావార్పు చేసి నిరసనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుబారం మొపుతున్నారు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంకు గడచిన 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సర్కారు వంతపాడుతు ప్రతి బిల్లుకు మద్దతు తెలిపిన విషయంను రాష్ట్ర ప్రజలు మరవరనీ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల విద్యత్ ఛార్జీలు, బస్సు చార్జీలు,రిజిస్టేషన్ చార్జీలు,ఇంటిపన్ను చార్జీలు చెత్త పన్ను చార్జీలు అకరికి మందుపై బాదుడు బాది దొందు దొందే అనే రీతిలో ఉన్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా ప్రజలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జలగలాగా పిల్చీ పిప్పీ చేస్తున్నారు.కాని దొంగే దొంగ అన్న ఛందగా ఇవలా B R S నాయకులు దర్నాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అందువల్ల రానున్న రోజుల్లో కాంగ్రేస్ పార్టీని గెలిపించడం వల్ల గ్యాస్ 500 కే ఇవ్వడం జరుగుతుందనీ నిరుపేద మద్య తరగతి వారికి లాభం జరగాలంటే కాంగ్రేస్ పార్టీ ఆదికారంలోకి రావలని మహ్మద్ అయూబ్ అన్నారు.ఇ కార్యక్రమంలో జిల్లా మహిళ అద్యక్షురాలు పార్వతమ్మ, జిల్లా బిసి సంఘాల అధ్యక్షులు ఒర్సు తిరుపతి,జన్ను రవి, గజ్జల లింగన్న, గొల్లేన రవి, జన్ను వివేక్, ఆదాం, గిన్నారం రాజు, జన్ను జీవన్ వేణు తజమముల్ మన్సుర్, జాని ,ఖాజా పాషా, రజీయా,కిన్నేర రవి,లు పాల్గొన్నారు.