ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: తపస్ రాష్ట్ర నాయకులు రాగిరాములు

 

మెదక్ ప్రజా బలం న్యూస్ :-

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రామాయంపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో, జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల మోడల్ స్కూల్ మిర్జాపల్లిలో మహబూబ్ నగర్, హైదరాబాద్,రంగారెడ్డి తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని నిర్వహించిన తపస్ నాయకులు వారిని ఏవీఎన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తపస్ రాష్ట్ర నాయకులు రాగి రాములు అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని , వాటిని పరిష్కరించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏబీఎన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, జిల్లా ఉపధ్యక్షులు వెంకట స్వామి, రఘు షా, కృష్ణ మూర్తి, శేఖర్, నాగేశ్వర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking