ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని బాలికల విద్యతోనే అభివృద్ధి సాధ్యమని కమిషనర్ కార్యాలయ ప్రత్యేక అధికారిణి సంధ్యారాణి అన్నారు.లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత ఆశ్రమ పాఠశాలని శుక్రవారం ఆకస్మికంగా తనిఖి చేసిన ఆమె విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,భోజన వసతి,పదవ తరగతి ప్రత్యేక కార్యాచరణ తదితర అంశాలపై ఆరా తీశారు.
అనంతరం పదవతరగతి విద్యార్థినిలతో మాట్లాడుతూ.. పరీక్షలకు తక్కువ సమయం ఉండటం తో సమయాన్ని వృధా చేయకుండా నిరంతర సాధన చేసి 10జిపిఏ సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలికల విద్యతోనే అభివృద్ధి సాధ్యమని తలితండ్రులకు, ఉపాధ్యాయులకు,సమాజానికి మంచి పేరు తీసుకురవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రత్యేక అధికారిణి వెంట డి.టి.డి.ఓ నీలిమ,ఏ.టి.డి.ఓ చిరంజీవి, స్పోర్ట్స్ ఆఫీసర్ జీవరత్నం,హెచ్. డబ్ల్యూ.ఓ,ప్రధానోపాధ్యాయులు, ఏఎన్ఎమ్ లు పాల్గొన్నారు.