సిద్దిపేట ఫిబ్రవరి 13 ();లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మరియు సిద్దిపేట కోర్టు బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మనపల్లి శ్రీనివాస్ కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు , బియ్యం , కూరగాయలు దాదాపు ఒక 2000 మందికి కరోనా సమయంలో సేవలన్దిన్చినందులకు గానుహైదరాబాద్ కు చెందినా ధీ లీడర్స్ పేజీ సంస్థ కరోనా వారియర్ గా కరోనా యోధునిగా అవార్డ్ ఇచ్చి సిద్ధిపేట బార్ అసొసియేషన్ లో ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా సంస్థ యాజమాన్య నిర్వాహకులు బొల్లు నర్సింహ యాదవ్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్ర సాధనలో సిద్దిపేట జిల్లా ఫోరంను స్థాపించి విశేష కృషి చేసినారన్నారు. ఫలితంగా 2016 లో అక్టోబర్ 10 న సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఆవిర్భావం జరిగింది.2009 మరియు 2014 లోక్ సత్తా పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్దిపేట నియోజక వర్గం నుండి పోటీ చేశారు,అనేక ప్రజాస్వామిక సంస్కరణల ఉద్యమంలో పాల్గొని ప్రక్యాతి పొందిన తుమ్మనపల్లి శ్రీనివాస్ సిద్దిపేట కేంద్రంగా రెండు దశాబ్దాలు న్యాయ వాదిగా పేదల పక్షాన రైతుల పక్షాన నిర్వాసితుల పక్షాన పోరాడి న్యాయ వదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నరన్నారు. తుమ్మనపల్లి శ్రీనివాస్ కరోనా కష్ట కాలంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు , బియ్యం , కూరగాయలు దాదాపు ఒక 2000 మందికి కరోనా సమయంలో సేవలు చేశారు. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు సాయిబాబా,మంతురి సత్యనారాయణ, చంద్రారెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎం శ్రీధర్ రావు, ఐరెని రాజ్కుమార్,తోటపల్లి రాజ్ కుమార్, వేంకట చారీ, వెంకటేష్, పర్వతం రాములు మరియు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కాజీపేట సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.