పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న పుల్కల్ బస్వాపూర్ జూనియర్ కళాశాల ప్రాంగణం .

• టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు.
• *కరెంటు బిల్లులు కట్టలేక కరెంట్ నిలిపివేసిన కళాశాల ప్రిన్సిపాల్
• ప్రతి క్లాస్ రూమ్ లలో చెత్త చెదారాలతో దర్శనం
• ఈ ఘోర పరిస్థితులపై మండల డిప్యూటీ ఎమ్మార్వో దృష్టికి తెచ్చినజిల్లా ఎన్ ఎస్ యు ఐ బృందం*
• పరిశీలన చెయ్యగా అవాకైనా అధికారులు ఇది కళాశాలన. అని ప్రిన్సిపాల్ కి కాల్ లోకి తీసుకున్న అధికారులు

సంగారెడ్డి ఫిబ్రవరి 13 ప్రజాబలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా పల్కల్ మండల కేంద్రము ప్రభుత్వ జూనియర్ కాలేజి పులుకల్ బస్వాపూర్ నూ జిల్లా ఎన్ఎస్యుఐ సందర్శించడం జరిగింది విద్యార్థులు ఎన్ఎస్యుఐ బృందంతో పలు సమస్యలను ఎన్ ఎస్ యు ఐ దృష్టికి తీసుకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ కళాశాల ప్రాంగణమంతా చూడగా కళాశాల ప్రాంగణమంతా ముళ్లపదలతో చెత్తచెదారాలతో ఉండటంతో కనీసం విద్యార్థులు కూర్చునే గదులు కూడా అపరిశుభ్రంగా చెత్తచెదారాలతో ఉన్నాయి. కరెంటు ఉన్న వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని విద్యార్థులు మాతో చెప్పగా ప్రిన్సిపాల్ గారు కరెంటు గురించి అడిగితే కరెంట్ బిల్లు మీ అయ్య కడతాడా ఎవరు కడతారు అని విద్యార్థిలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కనీసం విద్యార్థులకు టాయిలెట్స్ సదుపాయాలు లేక చాలా రోజులుగా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు వారి బాధలను చెప్పుకొచ్చారు. ఈ పలు విషయాలను రాతపూర్వకంగా రాసుకొని విద్యార్థులచే సంతకాలు తీసుకుని సంబంధిత మండల ఎమ్మార్వో వారికి కంప్లైంట్ ఇవ్వగా తక్షణంగా డిప్యూటీ ఎమ్మార్వో మండల ఆర్ ఐ ఎన్ ఎస్ యు ఐ బృందంతో కళాశాలకు విచ్చేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అందుబాటులో లేని ప్రిన్సిపాల్ తో ఫోన్లో ఈ విషయాలను అన్నిటిని చర్చించడంతో సరిగా సమాధానాలు చెప్పకుండా దాటు వేసే ప్రయత్నం చేశారు ఇప్పటికీ చాలాసార్లు ఎన్ఎస్ యు ఐ బృందం ఈ విషయాలపై ప్రిన్సిపాల్ తో చర్చించడం జరిగింది అయినా ప్రిన్సిపాల్ కనీసం స్పందించకుండా ఇలా వ్యవహరిస్తున్నాడని ఎస్ యు ఐ బృందం డిప్యూటీఎమ్మార్వో .ఆర్ఐ గారికి వివరిస్తూ కళాశాల ప్రాంగణమంతా చూపించడం చేశామూ. క్లాస్ రూమ్స్ పూడ్చే పరిస్థితి లేదు క్లాస్ రూములలో కరెంటు లేదు . వాటర్ లీకేజ్ అవుతున్న కనీసం పట్టించుకోకుండా ఉన్న తీరు పలుమార్లు మండల ఆర్ ఐ డిప్యూటీ ఎమ్మార్వో అధికారి ఈ విశాలపై ప్రభుత్వ పై అధికారులకు ఇంఫాం చేశారా అని అడుగుతే. లేనిపోని విధంగా సమాధానం చెబుతున్నారు. వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామని సంబంధిత డిప్యూటీ ఎమ్మార్వో కిరణ్ మండల ఆర్ ఐ మాధవ్ చెప్పారు ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా విద్య అధికారులు స్పందించి ఈ కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని అలాగే విధుల పట్ల అలసత్వం పలుమార్లు ప్రవర్తిస్తూ వస్తున్న విద్యార్థులపై అసభ్య కరంగా ప్రవర్తిస్తూ వస్తున్నజూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పై వెంకట్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వీలు అయితే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ లేదా ఈ కళాశాల నుంచి బదిలీ చేయాలని పలు విద్యార్థులు ఎన్ ఎస్ యు ఐ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు నిరంజన్. మండల ఎన్ ఎస్ యు ఐ సభ్యులు కిట్టు ప్రవీణ్ గిరి బన్నీ ప్రవీణ్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking