హాజరైన ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు.
తూప్రాన్, సెప్టెంబర్,23 ప్రజా బలం ప్రతినిధి :-
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని శివశక్తి యూత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద యజ్ఞ హోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ హాజరై పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో అయు అర్యోగ్యలతో ఉండాలని కోరుకున్నమన్నారు.
శనివారం ఇంటర్ నేషనల్ వైశ్యు ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి, ప్రముఖ సంఘసేవ కులు మున్సిపల్ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్త ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ యాగాదులు, హోమం, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ గుప్త మాట్లడుతూ మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. అన్ని దానాల కన్న అన్న దానం మిన్న అని అన్నారు. లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాదులు హోమం నిర్వహించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడు క్రుప కటాక్షాలు ప్రజలందరి పై ఉండి సిరి సంపదలతో ఆయు ఆరోగ్యలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి, మన్నే శ్రీనివాసరావు, సతీష్ చారి,కిష్టారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి,గడ్డం రవీందర్, స్వర్గం మురళి, ప్రభాకర్ గుప్తా, చంద్రారెడ్డి, పౌడలపల్లి రమేష్ ,ఉప్పల అశోక్ గుప్త, పడకంటి శ్రీనివాస్ గుప్త, చంద నారాయణగుప్త, బాలరాజు గుప్తా, కొడిప్యాక నాగరాజు, కొడిప్యాక చిన్న నారాయణ గుప్త, కమటాల రాజేశ్వర్ గుప్త, నీల ప్రవీణ్ గుప్త, పల్లేర్ల బాలేష్ గుప్త, గబ్బుల సిద్దిరాములు గుప్త, ఉప్పల నర్సింలు గుప్త, కోవూరు శ్రీనివాస్ గుప్త, గంగం శ్రీనివాస్ గుప్త, గబ్బుల సత్యవ్రత్ గుప్త, తాటి చంద్రవధన్, విశ్వం ,అంజి ,నాని వెంకట్ , సాయి యాదవ్, రవీందర్ తోపాటు ప్రజా ప్రతినిధులు శివశక్తి యూత్ సభ్యులు పాల్గొన్నారు.