వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 23:
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా వివిధ రూపాలలో గణనాథుడు కొలువై పూజలను అందుకుంటున్నాడు. వరంగల్ బీట్ బజార్ రైల్వే గేట్ ప్రాంతంలో నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడు అధ్యంతం ఆకట్టుకుంటున్నాడు. భారీ పరిమాణంలో మండపం పైన కొలువైన గణనాధుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రైల్వే గేట్ గణపతి కమిటీ అధ్యక్షులు అంకతి రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఏడు తమ ప్రాంత వ్యాపారస్తులు అందరం కలిసి గణనాధునికి విశేష పూజలు నిర్వహించుకుంటామని అన్నారు. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందచేస్తామని తెలియజేశారు గణపతి దయతో వ్యాపారాలు అభివృద్ధి చెంది ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. ఈ ఉత్సవాలలో గౌరవ అధ్యక్షులు ఎండి అలీ, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సహాయ కార్యదర్శి జీవన్, కోశాధికారి కాజా పాషా, సహాయ కోశాధికారి రాజు, సలహాదారులు ఆర్గనైజర్లు విగ్రహదాత వేణుగోపాల్ లలిత లు పాల్గొన్నారు.
Prev Post