గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బుల్లితెర తారలు

హైదరాబాద్ సెప్టెంబర్ 23 (); ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈ సారి మరో ప్రత్యేకతను కూడా చోటు చేసుకుంది.తెలుగు ప్రేక్షకుల అభిమాన టివి ఛానల్..జెమిని టివి నుండి,. జెమిని సీరియల్లో నటించే బుల్లితెర తారలు నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను.. భక్తులను స్వయంగా కలిసి వారితో ముచటిస్తున్నారు. ఈ కార్యక్రమం తేదీ 19తేది నుండి నిమజ్జనం జరిగే రోజు వరకు తొమ్మిది రోజులు పాటు జరుగుతూ ఉంటుంది. మహిళా ప్రేక్షకుల అభిమాన బుల్లితెర తారలంతా గణేష్ మండపాలకు విచ్చేసి అందరిని ఆనందంలో ముంచెత్తుతున్నారు.ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో గణేష్ మండపాలలో దర్శించడం మాకు ఎంతో సంతోషం కలిగించిందని అని బుల్లితెర తారలు తెలిపారు.జెమినీ టీవీ గణేష్ ఉత్సవాలలో భాగంగా ఇసిఐఎల్ లో యువసేన యూత్ అసోసియేషన్ లో మీ అభిమాన సీరియల్ “ఉప్పెన” ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న జనని (సోనియా) మరియు ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఎస్కేఆర్ ((జేఎల్ శ్రీనివాస్) భార్గవ్ కృష్ణ (కార్తిక్ ప్రసాద్)మరియు ఏఎస్ రావు నగర్ డివిజన్ 2 కార్పొరేటర్ సుంగి రెడ్డి శిరీష సోమశేఖర రెడ్డి అలాగే “సాధన” సీరియల్ నుండి హీరో విరాజ్(హుస్సేన్) హీరోయిన్ సాధన (శాంభవి) మరియు ఆర్టిస్ట్స్ మీనాక్షి ( సీత) దీప (ప్రియ) నవాజ్యోతి యూత్ క్లబ్ గణేష్ మండపాలని సాయంత్రం నేరుగా గణేష్ మండపానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేశారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking