సిద్ది వినాయక విగ్రహం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో గత 43 సంవత్సర లుగా వినాయక్ నగర్ లో.శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ్ సంఘం మరియు కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాడం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .భారీగా భక్తులు హాజరయ్యారు. అయితే కొన్నేళ్లుగా సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే చిన్నలింగ్ రవిందర్ గౌడ్ ఆకస్మిక మరణం తీరని లోటు అతని ఆత్మ శాంతించాలని భక్త బృందం వినాయకుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ పట్టణంలో మొదటి నుండి ఇక్కడే వినాయక నవరాత్రి వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు భజన హారికథ ఆట పాటలతో గల్లీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, అర్ ఐ రమేష్, సిద్ధివినాయక అసోసియేషన్ నాయకులు జె.కృష్ణ గౌడ్ సి.ఆర్.ప్రకాష్ గౌడ్ సి.మహేష్ గౌడ్ ఆర్.రమేష్ గౌడ్ ఆర్.లక్ష్మి నారాయణ. బంధం చంద్రం గుప్తా. హరి ప్రసాద్ రాహుల్ కార్తిక్ నందు ప్రదీప్ శ్యామ్ సిద్ధివినాయక అసోసియేషన్ సభ్యులు తదితరులు హాజరయ్యారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking