సింగరేణి గైర్హాజర్ ఉద్యోగులకు కౌన్సిలింగ్

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 7 :

భూగర్భగనులలో హాజరు శాతాన్ని పెంచి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి అధికారి పాటుపడాలని మందమరి ఏరియా జి దేవేందర్ అన్నారు. శుక్రవారం ఏరియాలోని సి.ఈ.అర్ క్లబ్ లో శాంతి ఖని, కె.కె -5, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ గనులలో మరియు వివిధ డిపార్టుమెంటు ల లో కనీసం 100 మస్టర్లు చేయని, గైర్హాజరు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం మీ అదృష్టమని మీ తల్లిదండ్రులు ఉద్యోగం చేసిన సమయంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని, కావున ప్రతి ఒక్క ఉద్యోగి తమ యొక్క హాజరు శాతాన్ని పెంచుకొని సంస్థ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సింగరేణి సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు మరెక్కడ లేవన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటి నుండి అయినా ఉద్యోగులు ప్రతినెల 20 మస్టర్ల చేయాలని సూచించారు. ఈకౌన్సిలింగ్ కు 102 మందికి గాను 55 మంది గైర్హాజరు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎ.ఐ.టి.యు.సి బ్రాంచ్ సెక్రటరి సలేంద్ర సత్యనారయణ,సీ.ఎం.ఓ.ఏ.ఐ ప్రెసిడెంట్ రమేష్, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ ఎండి అబ్దుల్ ఖాదీర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ ఎస్.ఇ జయప్రకాష్, ఏరియా హాస్పిటల్ డాక్టర్ జయవాని, డి.వై.పి.ఎం విశ్రాంత్, గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking