చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 7
మంచిర్యాల జిల్లాలోని
మందమర్రి మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన ఆయన ఒక కోటి 20 లక్షల ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు, ఒక కోటి 57 లక్షల ఈజీఎస్ నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పొన్నారంలో 25.89 లక్షలతో సీసీ రోడ్డు, స్కూల్ కంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం చేయనటువంటి రైతు రుణమాఫీ ఒకే దఫాలో రెండులక్షల రైతు రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను జనవరి నుంచి అందించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. చెన్నూరు నియోజక వర్గ అభివృద్దే నా లక్ష్యమని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.