పేదింటి అమ్మాయి పెళ్లికి ప్రజా వెల్ఫేర్ సొసైటీ అండ

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 7

మంచిర్యాల జిల్లా రామకృష్ణ పూర్ లో నివాసం ఉంటున్న పేద కుటుంబం బోడ రవి మణమ్మ గార్ల దంపతులకు ఇద్దరు సంతానం. వృత్తిరీత్యా కూలిపని చేసుకొన్నీ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారి పెద్ద కూతురు పెళ్లి కుదిరగా విషయాన్ని తెలుసుకుని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కొంతమంది దాతలు దగ్గరికి వెళ్ళి వారి సహకారంతో బీరువా, బియ్యం కొనుగోలు చేసి వారి కుటుంబానికి అందించారు. సహాయం అందించిన ప్రజా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాప అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ కు దాతకు సోసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభు దేవ్,మందమర్రి పట్టణ అధ్యక్షులు నదిపాట రాజు, జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్, ఎండీ జావిద్ పాషా, ఎర్రబెల్లి రాజేష్,అన్వేష్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking