ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ అప్లికేషన్ పై అవగాహన

 

ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 7:
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ అప్లికేషన్ పై పంచాయతీ సెక్రెటరీ లకు మరియు మున్సిపల్ వార్డు అధికారులకు, సంపూర్ణ అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు. కావున కలెక్టరేట్లో శనివారం రోజున ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఒక్కో ఉద్యోగికి 50 దరఖాస్తులు పరిశీలించేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడలు అధికారి శ్రీనివాస మూర్తి మరియు జిల్లా పంచాయతీరాజ్ అధికారి, హౌసింగ్ డిఈ,ఏఈ లు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking