పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బంది రోజువారీ జీతభత్యం పెంపు పై హర్షం వ్యక్తం చేసినా నిర్మల్ జిల్లా హోంగార్డ్ సిబ్బంది

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బంది రోజువారీ జీతభత్యం పెంపు పై హర్షం వ్యక్తం చేసినా నిర్మల్ జిల్లా హోంగార్డ్ సిబ్బంది
హోంగార్డుల సేవలను గుర్తించి రోజువారీ జీతం, ఇతర అలవెన్స్ల పెంపు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసిన నిర్మల్ జిల్లా హోమ్ గార్డ్ సిబ్బంది

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బందికి డిసెంబర్ 6 న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హోంగార్డు సేవలను గుర్తించి రోజువారి జీతం మరియు ఇతర అలవెన్స్లు పెంపుపై నిర్మల్ జిల్లా హోంగార్డ్ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ వర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా హోంగార్డు సిబ్బంది మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా విధినిర్వాహణలో శాంతిభద్రతల పరిరక్షణకు,ప్రజల రక్షణ కొరకు క్రమశిక్షణగా తమకు అప్పగించిన విధులు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సేవలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమం కొరకు సిబ్బందికి ప్రకటించిన వివరాలు.
1.హోమ్ గార్డుల దినభత్యం ఇప్పుడున్న రు921/-నుండి రు 1000/-కు పెంపు.
2.హోమ్ గార్డ్స్ వారం పరేడ్ అలౌన్స్ ను నెలకు రూపాయలు 100/-నుండి రూపాయలు 200/- కు పెంపు.
3.హోమ్ గార్డ్స్ లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా,యాక్సిడెంట్ మరణం చెందినా రూపాయలు 5 లక్షల. ఎక్స్ గ్రేషియా
ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్.ఐ రమేష్, హోం గార్డు సిబ్బంది అలీం, సురేందర్,నారాయణ, నరేందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking