గణేష్ నిమజ్జన, శోభయాత్ర,ట్రాఫిక్ రూట్ ఏర్పాట్లపై సీపీ పరిశీలన

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 11 : రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్, రామగుండం మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్ తో కలిసి పరిశీలన జరిపారు.
వినాయక నిమజ్జనం గోదావరి వంతెనపై నుంచి జరుగనున్నదని కావున సిబ్బంది, బందోబస్త్ ఏర్పాట్లు,మంచినీటి వసతి, గజ ఈతగాళ్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు గురించి,రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల నుంచి కూడా నిమజ్జనానికి గణనాథులు రానున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బంది కలగా కుండా నిమజ్జనం కు వచ్చే వాహనాల రూట్ మరియు వాటి ట్రాఫిక్ మళ్ళింపు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.నిమజ్జనంకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం ఈసారి మరింత కట్టుదితమైన భద్రత చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.సీపీ వెంట అడిషనల్ డీసీపీఅడ్మిన్ సీ రాజు,గోదావరిఖని ఏసీపీ రమేష్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరి టు టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, శ్రీరాంపూర్ సిఐ మోహన్,రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,సింగరేణి అధికారులు,మున్సిపల్,రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking