ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన ప్రభుత్వం సిపిఎం డిమాండ్.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 29 : ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన ప్రభుత్వం సిపిఎం డిమాండ్,సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున లక్షెట్టిపేట మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ…మంచిర్యాల జిల్లాలో గత నెల రోజులుగా విష జ్వరాలు,డెంగ్యూ వచ్చి ప్రజలంతా అల్లాడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.పైగా సమస్య లేదని చెపుతున్నారు.వీర నిర్లక్ష్యం మూలంగా ఇప్పటికే జిల్లాలో 8 మందికి పైగా మరణించడం జరిగింది. ఊర్లు,వార్డులు జ్వర పీడితులతో నిండిపోయి ఉన్నాయి.ప్రభుత్వ వైద్యం అందక బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోడం కోసం అప్పులు చేసి లక్షలాది రూపాయలు పోసి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్యశాఖ ఏం చేస్తుందని సిపిఎం ప్రశ్నిస్తుంది…?
కష్టకాలంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి,అధికారులకు ఉన్నప్పటికీ బాధ్యత రహిత్యంగా వ్యవరించడం జరుగుతుంది. తక్షణమే మంచిర్యాల జిల్లాలో , లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి. అస్పటల్ లో రోజు టేస్తుల సంఖ్య పెంచాలి. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి దోమల మందు,బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి.మండల ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి.రోగ నిర్ధారణ పరీక్షలకు ఎలాంటి ఆలస్యం చేయకుండా చూడాలి.ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులను నిర్వహించి దుర్వాసనను అరికట్టాలి.అనారోగ్యాల పాలైనవాళ్ళందరికీ,మెరుగైన వైద్యం అందించాలి, నాణ్యమైన భోజనము అందించాలని సిపిఎం మండలకమిటీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో సత్తక్క, రబియా,లక్ష్మి,ఎల్లవ్వ, మల్లవ్వ,బొర్రన్న,మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking