ఖమ్మం ప్రతినిధి జులై 12 (ప్రజాబలం)ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురై స్టంట్ వేయించుకొని, చికిత్స చేయించుకున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గి కృష్ణను వారి స్వగృహంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించారు.పాలకుల వ్యతిరేక విధానానికి, ఆదివాసి గిరిజనుల హక్కుల కొరకు ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న దుగ్గి కృష్ణ త్వరగా కోలుకోవాలని మల్లి బాబు యాదవ్ ఆకాంక్షించారు. వారికి మనోధైర్యం కల్పించారు కామేపల్లి మండలం లోని కొర్ర తండా గ్రామ మాజీ సర్పంచ్ అజ్మీర అర్జున్ మాతృమూర్తి అజ్మీర ద్వాళి అనారోగ్యంతో గురువారం మరణించారు శుక్రవారం నాడు వారి చిత్ర పటానికి పూలమాల వేసి మల్లిబాబు యాదవ్ ఘనంగా నివాళులు అర్పించారు. వారిఆత్మ కు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోడిర్యం కల్పించారు ఈ కార్యక్రమం లో ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాద్, మేకల మహేష్,బాబు అజ్మీరా రాందాస్, కొర్ర రాములు, నల్లమోతు వెంకటనరసయ్య, భూక్యా సుమన్ భూక్యా సీతారాములు, అజ్మీరా కృష్ణ, అజ్మీరా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు