పేద విద్యార్థుల కళ సహకారమై ఉద్దీపన
ఉద్దీపన తో విధ్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు
నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన వి. వి. యం పాఠశాలను ప్రారంభించిన కార్యక్రమంలో..
ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ :-పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఉద్దీపన ముఖ్య ఉద్దేశ్యం అన్ని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, శుక్రవారం నాడు నకిరేకల్ పట్టణంలోని తన మానస పుత్రిక ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఆద్యరంలో నిర్వహిస్తున్న ఉద్దీపన వి. వి. యం పాఠశాలను వారు ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రెస్ అకాడమీ చ్కెర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ చ్కెర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నల్గొండ డిఈవో బిక్షపతి, ఉద్దీపన చీఫ్ అడ్వైజర్ కె. ఆనంద్, మంగారెడ్డి, హెడ్ మాస్టర్ భద్రయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ గారు మాట్లాడుతూ:-
నేటి ఉద్దీపన కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణంలోని వివియం స్కూల్ ని స్థాపించి, విద్యార్థులకు, కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కి హృదయ పూర్వక ధన్యవాదములు..
ఓక వ్యక్తి జీవితంలో జీవితం మార్చడానికి విద్య చాలా అవసరం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందిసున్నారు
వెయ్యికోట్ల రూపాయల పని చేసిన దానికంటే ఎక్కువ ఈ కార్యక్రమం ఇస్తుంది
ఈ పాఠశాలలో విధ్యార్ధులు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న…

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ:-
ఉద్దీపన స్కూల్ ని ఏర్పాటు చేసి, పేద విద్యార్థులను ఉన్నత చదువు చదవాలని నేడు పాఠశాలను ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కి హృదయ పూర్వక ధన్యవాదములు
మట్టిలో కుడ మాణిక్యాలను తయారు చేస్తున్న వీరేశం అన్న గారు మా అందరికీ ఆదర్శం
ఈ పాఠశాలని ఆదర్శంగా తీసుకుని మా ప్రాంతంలో కూడ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తాం
పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ :-
ఆర్థిక ఇబ్బందుల ఉన్న పిల్లలకు విధ్యను అందించేయడమే ఉద్దీపన
ఉద్దేశం సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప ఆలోచనలు చేస్తున్న వీరేశం అన్నకి ధన్యవాదాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోనే విధ్యలో గుణాత్మక మార్పులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు..