ఫిబ్రవరి 27,28,29 తేదీలలో జరుగు సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి.

 

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 31.

ఈరోజు స్థానిక ముకుందా లాల్ మిశ్రా భవన్ లో వర్ణ వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా హాజరైన జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 27,28,29 తేదీలలో జిల్లా ప్లీనరీ సమావేశాలు కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశాలలో జిల్లా ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్య కర్తవ్యాలను రూపొందిస్తామని అన్నారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం న్ని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు.
దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బిజెపి అని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పదం గడపడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు అయోధ్యలో రామ మందిరం పేరిట రాజకీయం చేస్తున్నారని దైవభక్తి అనేది వ్యక్తిగతమైనదని రాజకీయాల్లోకి కులాలను మతాలను తీసుకురాకుండా అందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సిబిఐ ఈడి లను తమ జీవ సంస్థలుగా ఉపయోగించుకుంటూ తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపైన అక్రమ కేసులు బనయిస్తున్నారని అన్నారు బీహార్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని కుట్రలతో ప్రభుత్వాన్ని కూల్చారని ఝార్ఖండ్లో అలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.
బిజెపి రాజకీయ ఎత్తుగడలను కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని కరీంనగర్ పట్టణంలో సైతం కార్పొరేటర్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను కాజేశారని కొంతమందిని అరెస్టు చేశారని ఇంకా అనేకమంది భూకబ్జా కోరలు ఉన్నారని వాటిపైన విచారణ జరిపించి అందర్నీ అరెస్టు చేయాలని అన్నారు.
రైతుబంధు సకాలంలో పడక రైతులు ఇబ్బంది పడుతున్నారని చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే విధంగా వెంటనే నిధులను విడుదల చేయాలని అన్నారు సంఘటిత అసంఘటిత రంగ ప్రజలకు చిరు వ్యాపారస్తులకు పేదలకు సిపిఎం అండగా ఉంటుందని రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత ఉదృతంగా పోరాడేందుకు జిల్లా ప్లీనరీ సమావేశాలు కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నామని ఈ ప్లీనరీ సమావేశాల విజయవంతానికి ప్రజల సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం,G. జిమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు U.శ్రీనివాస్,సుంకరి సంపత్,శీలం అశోక్ D.నరేష్ పటేల్ నాయకులు కాల్వ సురేష్ జి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking