ఖమ్మం ప్రతినిధి జనవరి 31 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పదవీ విరమణ చేయుచున్న కామేపల్లి మండలంలో పదవీ విరమణ చేయుచున్న గ్రామపంచాయతీ సర్పంచులకు డిసిసిబి డైరెక్టర్ మాజీ జెడ్పిటిసి మేకల మల్లి బాబు యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శాలువాలు తో సత్కరించి బొకేలతో కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని, సర్పంచుల పదవీకాలం లో బాధ్యతలు, కష్టనష్టాల గురించి బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు. సర్పంచులు పదవి లేకున్నా, ప్రజలలో నిత్యం ఉండి మా సేవల్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గ్రామాలకు సర్పంచ్ పదవి అత్యున్నతమే అయినప్పటికీ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వారికి మళ్లీ అవకాశం రావచ్చని లేదా ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉందని తెలిపారు, మీరంతా బాధ్యతల్ని సేవలను సక్రమంగా నిర్వర్తించారని మీరు చేసిన సేవల్ని ప్రజలు గుర్తుంచుకుంటారని ప్రశంసించారు. ప్రజలతోనే కాకుండా వ్యక్తిగతంగా తనతో ఉన్న అనుబంధాన్ని మల్లిబాబు యాదవ్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫక్ ఫతే మహ్మద్, ఏపూరి మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, భానోత్ నర్సింహ నాయక్, రామకృష్ణ, లక్ష్మయ్య, అజ్మీర హరి, గ్రామ పంచాయతీల సర్పంచులు కోడెం సులోచన, అజ్మీర అర్జున్, భానోత్ రవి, మూడు దుర్గా జ్యోతి, లకావత్ బీమా జరుపల రామారావు, అనంత రాములు, గుగులోతు దేవి, సునీత కిన్నెర నాగయ్య, విజయ, బొడ్డు కాంతయ్య జాటో తులసి కళ్యాణి,ఎంపీటీసీ లు గుగులోత్ గబ్రు నాయక్, నల్లమోతు లక్ష్మయ్య, లకావత్ సునీత, ఇట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు