ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు రెండు రోజులు నిర్వహిస్తున్న ధర్నాకు సిపిఎం పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ హాజరై మాట్లాడడం జరిగింది .కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది ప్రజలకు ఇచ్చిన కార్మికులకు ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాగ్దానాలు గానే మిగిలిపోయాయి. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే అంగన్వాడీ టీచర్లకు 18000 వేతనం ఇస్తానని చెప్పి ప్రకటించారు. కానీ ఆ డిమాండ్ ని ఏమాత్రం పట్టించుకోకుండానే సంవత్సరం గడిపారు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కార్మికులకు ఉద్యోగులకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం కోసం నిర్ణయాలు చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.18 వేల రూపాయల వేతనం వెంటనే పెంచి ఇవ్వాలని, అంగన్వాడీలకున్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది.అంగన్వాడీలకు మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి పాల్గొని మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్* అంగన్వాడి యూనియన్ నాయకులు పాల్గొన్నారు
Next Post