ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 18 : ఈనెల 16న లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరిరోడ్డుకు చెందిన కొత్త శ్యామల అనే మహిళ మెడలో బంగారు గొలుసు దొంగిలించిన నిందితురాలు సముద్రాల వసంత,తండ్రి శ్రీనివాస్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాందుకు తరలించడం జరిగింది.బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన ఎదురు ఇంట్లో ఉండే నిందితురాలు వసంత ప్లాన్ ప్రకారం శ్యామల మెడలోని సుమారు 3 తులాల బంగారు పుస్తెలు తాడు లాక్కొని పరార్ అయ్యింది. బాధితురాలు శ్యామల పిర్యాదు మేరకు పారిపోయిన మహిళను అదుపులోకి తీసుకొని గొలుసు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించామని లక్షెట్టిపెట సిఐ అల్లం నరేందర్,ఎస్సై పి సత్తిష్ తెలుపారు.