ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 18:
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పూర్వన్ష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నిరుపేదైన మల్లేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు 8000 వేల గల నిత్యవసర వస్తువులు అందించినట్లు మందమర్రి పట్టణ అధ్యక్షుడు నందిపాట రాజు తెలిపారు. గత కొన్ని నెలలుగా మల్లేష్ అనే వ్యక్తి తన వృత్తి డ్రైవర్ చేసుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గురికాగా ఆ సమాచారం కొంతమంది స్థానికులు మా ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం ఇవ్వడంతో
వెంటనే వారికి సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పూర్వాన్ష్ వర్మ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.డీ జావిద్ పాషా, గోపాల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.